గోరుముద్దలు తింటూ ...
చందమామ కథలు వింటూ ...
అమ్మకి దొరకకుండా పరిగెత్తడం ... !
జెండా వందనం రోజున , ప్రొద్దున్నే లేచి ,
ఊరంతా తిరిగి , మనస్పూర్థిగా జెండా కి జై కొట్టి,
ఇంటికి ఆడుతూ వెళ్ళడం ... !
ఆరవ తరగతిలో , మొదటి సారిగా
స్నేహితురాలి చేతిలో
చెయ్యేసి నడవడం ... !
దొంగా పోలీస్ ఆటలో ,
ఆరు గంటలు దొరకకుండా
దాక్కోవడం ... !
ప్రతీ రాత్రి , అమ్మ ఒడిలో
ప్రశాంతంగా , వెచ్చగా ,
కాళ్ళు ముడుచుకొని పడుకోవడం ... !
దసరా పండగకి , కొత్త బట్టలతో
ఒక్క చేతిలో పిస్తోలు ,ఇంకో చేతిలో రీళ్ళు ..
మొదటిసారిగా చేర్ పటాక కాల్వడం ... !
ఎండాకాలం సెలవులకై రాసే ఆఖరు పరీక్ష అయిపోవడం ...
సైకిలు కాంచి స్నేహితులందరి కంటే ముందుగా నేర్చుకోవడం ...
నాన్న తెచ్చే బొమ్మలకోసం ఎదురుచూడడం ...
మరియు
చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ..
ఇప్పుడు నేననుభవిస్తున్న ఈ తియ్యని బాధ ..
" ఆనందం "
No comments:
Post a Comment