అచ్చు
"పాతికేళ్ళ నుంచీ కవితలు రాస్తున్నానన్నారు కదా. ఇప్పటికి ఎన్ని కవితలు అచ్చు అయ్యాయి" అడిగాడు మురళి.
"ఓ! ఇన్ని!" తల వెంట్రుకలను చూపిస్తూ చెప్పడు కావ్యారావు.
"ఓహో అలాగా... రెండా?" అన్నాడు మురళి.
***********************************************************
కూర
"ఈ రోజు మీ ఇంట్లో బెండకాయ కూర చేశారు కదూ వదినా?"
"అరె! అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగారు?"
"రాత్రి మా దొడ్లో బెండకాయలు ఎవరో దంగవెధవలు కోసుకెళ్ళార్లే"
**********************************************************
దాచు
"రాధా....రాధా... వెంటనే మీ అమ్మగారిని గదిలోకి వెళ్ళి గంటదాకా బయటకు రావద్దని చెప్పు మా ఆఫీసరొస్తున్నారు" కంగారుగా అన్నాడు కృష్ణ.
"మీ ఆఫీసరుగారొస్తే మా అమ్మకేం భయమండీ?" అయోమయంగా అన్నది రాధ.
"అబ్బా... నీకు తెలియదు. మా అత్తగారు చనిపోయారని చెప్పి మొన్నటినుంచి సెలవులో ఉన్నాను" విషయం చెప్పాడు కృష్ణ.
********************************************************
తొందర
"మనమ్మాయికి మంచి అందగాడిని, తెలివితేటలు గలవాడిని, ఆస్తిపరుడిని వరుడిగా తేవాలనుకుంటున్నాను" భార్యతో చెప్పాడు రామబ్రహ్మం.
"నిజం చెప్పారండీ ఈ విషయంలో మాత్రం మా నాన్నలా మనం తొందరపడకూడదు" చెప్పింది భార్య
******************************************************
ఉచితం
"డాక్టర్ గారూ... నెను చాలా పేద వాడినండీ.... మీరడిగినంత ఫీజు ఇచ్చుకోలేను. ఎట్టాగైనా నాకు వైద్యం చేయండి బాబూ... కానీ జీవితాంతం నేను పైసా పుచ్చుకోకుండా మీ కుటుంబం అంతటికీ పని చేసి పెడతాను" వినయంగా అన్నాడా వ్యక్తి.
"సరే... ఇంతకూ నువ్వేం పని చేస్తుంటావు?" అడిగాడు ఆసక్తిగా అక్తర్.
"కాటికాపరినండీ... శవాలు తగలబెడుతుంటాను" అన్నాడతను.
******************************************************
చండశాసనుడు
"నేను చండశాసనుణ్ణి, ఏ చిన్న పొరబాటునూ సహించలేను. నిన్న నా భార్య కాఫీలో పంచదార తక్కువేసింది. వెంటనే దవడలు వాయించాను" అన్నాడు చిదంబరం.
"నువ్వు చాలా అదృష్టవంతుడివి గురూ. నీకు చాలా మంచి కలలు వస్తుంటాయి" తలమీద బొప్పిని తడుముకుంటూ అన్నాడు సారధి.
********************************************************
డాక్టర్ చతురుడు
చెకప్ కోసం పిల్లలను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు దంపతులు. భర్త ఒడిలో పిల్లాడున్నాడు, భార్య ఒడిలో పాప.
"బాబుది మీ పోలికే" నాడి చూస్తూ అన్నాడు డాక్టర్. నవ్వి ఊరుకున్నడు భర్త.
"మీ పాప చాలా ముద్దుగా ఉంది" చెప్పాడు డాక్టర్. నవ్వి ఊరుకుంది భార్య.
"వచ్చిన ప్రతివాళ్ళ్తో ఇలా ముద్దుగా ఉన్నారనే చెబుతారనుకుంటా" అన్నాడు భర్త.
"లేదు. నిజంగా నాకు నచ్చిఏనే చెబుతాను"
"నచ్చకపోతే?"
"మీ పోలికే అంటాను"
*********************************************************
No comments:
Post a Comment