Thursday, 4 September 2008

ఎదురుచూపు

తలుపు చాటు నుండి చూసే
ఓ ఓర చొపు ..

గుండె లోతుల్లో ప్రేమతో నిండిన
ఓ అమాయకపు చూపు ..

చూసీ చూడనట్టు చూసే
ఓ కొంటె చూపు ...

వేయి భావాలు పలికే
ఓ కన్నె చూపు ..

బతుకమ్మ సందట్లో మెరిసే
ఓ అందమైన చూపు ..

తీవ్ర కోపాన్ని పంటి కింద అనుచుకున్న
ఓ నిశ్శబ్దపు-కసి చూపు ..

చివరగా

నన్ను బ్రతికిస్తున్నది ,
నువ్వు నాకై చూసే
ఓ ఎదురుచూపు ..!!

2 comments:

Unknown said...

hey.....itz gud

Anonymous said...

Nice poetry Madhu - SRK